శ్రీలీలతో అఖిల్ లవ్ స్టోరీ.. రంగంలోకి నాగార్జున..!
on Apr 7, 2025
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. (Akhil Akkineni)
'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్.. ఎట్టకేలకు కొత్త సినిమా అప్డేట్ ఇస్తున్నాడు. అఖిల్ తన ఆరవ సినిమాని 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో చేస్తున్నాడు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రేపు(ఏప్రిల్ 8) విడుదల కానుంది. ఈ చిత్రానికి 'లెనిన్' అనే టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కుతోందట. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. (Lenin)
అఖిల్, శ్రీలీల ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు. అఖిల్ ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగతా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. ఇక 'ధమాకా', 'భగవంత్ కేసరి' సినిమాలతో ఆకట్టుకున్న శ్రీలీల.. ఇటీవల వరుస పరాజయాలను చూసింది. అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కోసం జత కట్టారు. మరి ఈ 'లెనిన్' వీరికి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
