ఉత్తమ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..కేరళ సిఎం స్పష్టీకరణ
on Apr 17, 2025

మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)గత ఏడాది మార్చి 28 న సర్వైవల్ డ్రామా 'ఆడుజీవితం'(Aadujeevitham)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. మూవీలోని 'నజీబ్ మహ్మద్' క్యారక్టర్ కోసం పృథ్వీరాజ్ ఎంతగానో కష్టపడి సన్నబడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కింది. కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డులలో'ఆడుజీవితం' తొమ్మిది అవార్డులని గెలుచుకుంది.
బుదవారం అవార్డుల కార్యక్రమం జరగగా ఉత్తమ నటుడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. మిగతా విభాగాల విషయానికి వస్తే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పాపులర్ ఫిలిం, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, ఉత్తమ కలరిస్ట్ ఇలా మరో రెండు విభాగాల్లో కలిపి మొత్తం తొమ్మిది అవార్డుల్ని గెలుచుకొని 'ఆడుజీవితం' తన సత్తా చాటింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



