వ్యాపారంలో ప్రభాస్-చరణ్ మల్టీస్టారర్..!!
on Dec 17, 2017
.jpg)
టాప్ హీరోలు అయినప్పటికీ తోటి హీరోలందరితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారు. మిత్రులతో కలిసి యూవీ క్రియేషన్స్ పేరుతో మిర్చి, రన్ రాజా రన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు ప్రభాస్. అలాగే ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామ్యంతో వ్యాపారంలోకి ప్రవేశించాడు చెర్రీ. వీరిద్దరూ కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారంటూ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పర్సనలైజ్డ్ మూవీ థియేటర్స్‌ను ప్రతి పట్టణంలోనూ ప్రారంభించాలన్నది వీరి ఆలోచనట. 70 నుంచి 100 అంగుళాల స్క్రీన్లు, లేటేస్ట్ వెర్షన్ సౌండ్ సిస్టమ్‌తో.. ఇద్దరి నుంచి 12 మంది వరకు ఒకేసారి సినిమాలు చూడగలిగేలా ఈ థియేటర్లు ఉంటాయట. తద్వారా ఓ కుటుంబమంతా కలిసి సినిమాను థియేటర్‌లో చూసిన అనుభూతి పొందవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. అఫీషియల్‌గా ప్రకటన లేకపోయినప్పటికీ అతి త్వరలోనే ప్రభాస్-చెర్రీలు వ్యాపార భాగస్వాములు అయ్యే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



