ప్రభాస్‌తో స్టార్ హీరోయిన్ చెల్లి..?
on Oct 25, 2016
.jpg)
ప్రజంట్ బాహుబలి షూటింగ్ చివరి దశకు చేరడంతో తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో..రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి నేషనల్ వైడ్ పాపులారిటి రావడంతో ఇక మీదట నటించే సినిమాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావడంతో ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదంతా పక్కనబెడితే ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్‌ని వెతికే పనిలో పడింది చిత్ర యూనిట్. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా చెల్లెలు, పరిణితీ చోప్రా ప్రభాస్‌తో ఆడిపాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పరిణితీ చోప్రాతో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారట..ఆమె నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్లే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



