ENGLISH | TELUGU  
Home  » Gossips

పద్మభూషణ్‌ విషయంలో హీరోలను బ్యాడ్‌ చేస్తున్న ఫ్యాన్స్‌.. తారాస్థాయికి చేరిన రగడ!

on Apr 28, 2025

సాధారణ హీరో నుంచి స్టార్‌ హీరోగా ఎదిగే క్రమంలో అభిమానగణం కూడా బాగా పెరుగుతుంది. ఏ స్టార్‌ హీరోకైనా వీరాభిమానులు ఉంటారు. హీరోల వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో హీరోల మధ్య వృత్తిపరమైన పోటీ ఉంటుంది. వ్యక్తిగతంగా వారు ఎంత స్నేహంగా ఉంటారో మనం చూస్తున్నాం. కానీ, హీరోల అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడూ వార్‌ జరుగుతూనే ఉంటుంది. తమ హీరో గొప్పవాడంటే.. తమ హీరో గొప్పవాడంటూ గొడవలు పెట్టుకోవడం మనం చూశాం. 80వ దశకం నుంచి ఫ్యాన్స్‌ మధ్య ఈ తరహా వార్‌ బాగా జరిగేది. కాలం మారుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో కూడా మార్పు వచ్చింది. అయితే ఇటీవల అల్లు అర్జున్‌ ఆర్మీ, మెగా ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియాలో పెద్ద రగడే జరిగింది. హీరోలపై తమ అభిమానాన్ని చాటుకునే విషయంలో తమిళ ప్రజలు కాస్త ఓవర్‌ చేస్తారనే ప్రచారం ఉంది. తమిళ సినిమాల్లో ఓవర్‌ యాక్షన్‌ ఎలా ఉంటుందో.. అలాగే ఫ్యాన్స్‌ తమ హీరోలపై చూపించే అభిమానం కూడా అంతే ఓవర్‌గా ఉంటుంది. 

తాజాగా పద్మభూషణ్‌ పురస్కారం విషయంలో అజిత్‌, విజయ్‌ అభిమానుల మధ్య ఓ వివాదం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం కోలీవుడ్‌కి చెందిన అజిత్‌కు, టాలీవుడ్‌కి చెందిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్‌కు పద్మభూషణ్‌ అవార్డు రావడంతో విజయ్‌ ఫ్యాన్స్‌ తమ అక్కసును వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. అజిత్‌ అంత యోగ్యుడు కాదని, అతనికి అంతటి పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అజిత్‌ కెరీర్‌ ప్రారంభంలో నటి హీరాను ప్రేమించాడని, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలీదుగానీ అజిత్‌ మాత్రం 2000లో షాలినిని వివాహం చేసుకున్నారు. హీరా విషయానికి వస్తే.. 2002 పుష్కర్‌ మాధవ్‌ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అయితే 2006లోనే అతని నుంచి విడాకులు తీసుకుంది. పాతికేళ్ళ క్రితం అజిత్‌, హీరా మధ్య వచ్చిన ఆ రూమర్‌ని ఇప్పుడు విజయ్‌ ఫ్యాన్స్‌ తవ్వి బయటికి తీసి అజిత్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. హీరాను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్‌ ఎలా ఇస్తారు అనేది వారి ప్రశ్న. 

విజయ్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతూ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు అజిత్‌ ఫ్యాన్స్‌. ‘మా అజిత్‌ హీరో మాత్రమే కాదు, కార్‌ రేసుల్లో వరసగా మూడుసార్లు విన్‌ అయి ప్రపంచ కార్‌ రేసులో భారత జెండాను ఎగురవేశారు. అలాగే గన్‌ షూటింగ్‌లో కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్న మా అజిత్‌ పద్మభూషణ్‌కి నూటికి నూరు శాతం అర్హుడు. మీ హీరో విజయ్‌ ఏమైనా ఉత్తముడా.. హీరోయిన్‌ సంఘవిని ఎంతో ఇబ్బంది పెట్టాడు. త్రిషతో సహజీవనం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు, అతని భార్య సంగీత లండన్‌ వెళ్లిపోయింది. విజయ్‌ పెట్టిన కొత్త పార్టీ టివికె ఓపెనింగ్‌కి అతని భార్యగానీ, కొడుకులు గానీ రాలేదు. దీన్ని బట్టి విజయ్‌, సంగీత విడిపోయారని అర్థమవుతోంది. అలాంటి విజయ్‌ గురించి గొప్పగా చెప్పడం, మా హీరోని నిందించడం కరెక్టా?’ అంటూ అజిత్‌ ఫ్యాన్స్‌.. విజయ్‌ ఫ్యాన్స్‌కి స్ట్రాంగ్‌ రిటార్డ్‌ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్‌ వల్ల ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల దృష్టిలో బ్యాడ్‌ అవుతున్నారనేది మాత్రం వాస్తవం. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.