విశ్వక్ సేన్ తో పవన్ కళ్యాణ్ హీరోయిన్ వార్త నిజమేనా!
on Sep 24, 2024
సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోయే హీరోల్లో విశ్వక్ సేన్(vishwak sen)కూడా ఒకడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) బెస్ట్ ఫ్రెండ్ తాళ్లూరి వెంకట్(talluri venkat)నిర్మాణ సారథ్యంలో మెకానిక్ రాఖీ(mechanic rocky)చేస్తున్నాడు.అనుకున్న టైం కి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కంటిన్యూ గా షూట్ లో పాల్గొంటున్నాడు.ఇది సెట్స్ మీద ఉండగానే జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలోని మూవీకి కమిట్ అయ్యాడు.
విశ్వక్ సేన్, అనుదీప్ ల కాంబో కి ఇప్పుడు మూవీ లవర్స్ లో ఎంతో ఆసక్తి ఏర్పడింది.అంతే కాకుండా సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచబోతుంది. అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్త చాలా జోరుగానే వినిపిస్తుంది. ప్రియాంక మోహన్(priyanka mohan)ఇప్పటికే నానితో సరిపోదా శనివారంలో చేసి మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాకుండా తన లిస్ట్ లో పవన్ ఓజి కూడా ఉంది. ఈ క్రమంలో విశ్వక్ తో ప్రియాంక జోడి కడితే ఆ మూవీకి ఏర్పడే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.
ఇక త్వరలోనే ఈ విషయం మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆ మూవీని ఎవరు నిర్మిస్తారు,సాంకేతిక నిపుణులెవరు, ఎవరెవరు నటించబోతున్నారనే న్యూస్ మరికొద్ది రోజుల్లో బయటకి వచ్చే అవకాశం ఉంది.
Also Read