మహేష్ డైరెక్టర్ తో సూర్య మూవీ.. దిల్ రాజు డేరింగ్ స్టెప్!
on Oct 30, 2025

మరో తెలుగు దర్శకుడితో సూర్య మూవీ
మహేష్ డైరెక్టర్ కి ఓకే చెప్పిన తమిళ హీరో!
దిల్ రాజు నిర్మాణం..?
కోలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. విజయ్ 'వారసుడు' చేయగా, ధనుష్ 'సార్, కుబేర' సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు సూర్య వంతు వచ్చింది. ఇప్పటికే వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్న సూర్య.. మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Suriya)
సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న తమిళ హీరో సూర్య.. తన 45వ సినిమా 'కరుప్పు'ని ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. అలాగే తన 46వ సినిమా కోసం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు సూర్య మరో తెలుగు దర్శకుడితో చేతులు కలబోతున్నట్లు సమాచారం.
Also Read: రష్మిక సినిమాలో సందీప్ రెడ్డి.. ఆడియెన్స్ నవ్వుతారు!
సోలో, గీత గోవిందం వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్.. కొంతకాలంగా హీరోల వేటలో ఉన్నాడు. మహేష్ బాబుతో చేసిన 'సర్కారు వారి పాట' పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విజయ్ దేవరకొండతో చేసిన 'ది ఫ్యామిలీ స్టార్' నిరాశపరిచింది. వీటికి తోడు, రకరకాల కారణాల వల్ల తెలుగు హీరోలు పరశురామ్ కి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో తమిళ హీరో కార్తీతో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ప్రయత్నించాడు. ఎందుకనో అది వర్కౌట్ కాలేదు. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా కార్తీ సోదరుడు సూర్యతో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
పరశురామ్ చెప్పిన కథకు సూర్య ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించనున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



