
స్టార్ హీరో సూర్య ఈ నెల 6 న 'సీన్'మూవీతో సెల్యులాయిడ్ కి హాయ్ చెప్తున్న విషయం తెలిసిందే. సూర్య వరుస విజయాలతో జోరు మీద ఉండటం, మలయాళ హిట్ మేకర్ జీతూ మాధవన్ దర్శకుడు కావడంతో సీన్ పై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా ఒకే రేంజ్ లో ఉన్నాయి. సూర్య కెరీర్ లో సీన్ మూవీ 47 . దీంతో ప్రతిష్టాత్మక 50 వ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిఫరెంట్ మేకింగ్ స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య తన 50వ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్య తన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని ఎంచు కుంటాడనే విషయం తెలిసిందే. అరుణ్ మాతే శ్వరన్ తెరకెక్కించిన చిత్రాలలోని రా అండ్ రస్టిక్ మేకింగ్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక రేంజ్ లో ఉంటాయి. పాన్ ఇండియా ప్రేక్షకులు సైతం అరుణ్ మాతేశ్వరన్ సినిమాల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో సూర్యతో ఈ కాంబినేషన్ సెట్ అయితే స్క్రీన్ పై విజువల్ వండర్ చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇది కూడా చదవండి: గ్లామర్ ఫోటోషూట్స్ చూసి అలా అనుకోవద్దు: దిశా పటానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇది కేవలం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక రూమర్ మాత్రమే. సూర్య ప్రస్తుతం తన లైనప్‌లో భాగంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా మారబోయే 50వ సినిమాకిఅరుణ్ మాతేశ్వరన్ పేరు బలంగా వచ్చి చేరడంతో ఈ కాంబినేషన్ నిజమవుతుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ ప్రీవియస్ మూవీ 'డీసీ' తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
[Suriya 50 Th Movie Arun Matheswaran Rumours, Suriya 50, Arun Matheswaran, Suriya 50th movie, Kollywood news, Suriya upcoming movies, Tamil cinema updates,TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]





