యాంకర్ సుమ సింగర్ కాబోతుందా..?
on Feb 7, 2017
.jpg)
తనమార్క్ పంచ్‌లతో..చలాకితనంతో బుల్లితెర మహారాణిగా వెలుగొందుతోంది స్టార్ యాంకర్ సుమ. అంతేనా ఇటు బుల్లితెర మీద షోలతో పాటు ఆడియో ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లతో ఫుల్ బిజీ. అలాంటి సుమ త్వరలో మరో అవతారం ఎత్తనుంది. అదే సింగర్ అవతారం.. కేరళ గడ్డ మీద పుట్టినప్పటికీ..తెలుగుని తెలుగువారికన్నా బాగా మాట్లాడుతూ చెడుగుడు ఆడుకుంటుంది సుమ. అలా చాలా సినీ ఫంక్షన్స్‌లో సుమ గొంతు విని..ఆమెను పాట పాడించడానికి ఒప్పించారు సంగీత దర్శకుడు తమన్.
ఇంతకీ సుమ పాడేది ఎవరికోసమో తెలుసా..మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమా కోసం..ప్రజంట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ అనే సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని దర్శకుడు భావించడంతో అది ఇంకా స్పెషల్‌గా ఉండటానికి యాంకర్ సుమతో పాడిస్తే అదిరిపోతుందని థమన్ సుమని సంప్రదించాడట..దీనికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్..అన్నట్లు ఆ ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేసేది ఎవరో తెలుసా హాట్ యాంకర్ అనసూయ. ఇద్దరు స్టార్ యాంకర్‌ల కాంభినేషన్‌లో సాంగ్ అంటే దుమ్మురేపటం ఖాయం కదా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



