కొరటాలతో ఎందుకు ఒప్పుకున్నావ్ సమ్మూ..?
on Sep 19, 2016

ఈమధ్య సౌత్ ఇండియన్ సినిమాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది సమంత. దక్షిణాది చిత్రాల్లో కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉండడం లేదని, అందుకే తాను సినిమాల్ని పెద్దగా ఒప్పుకోవడం లేదని తేల్చి చెప్పింది. తన ఖాతాలో సినిమాల సంఖ్య తగ్గిపోవడానికి కారణం తాను కాదు, తన దగ్గరకు వస్తున్న కథలే అని స్పష్టం చేసింది. అయితే ఇటీవల సమంత చేసిన సినిమాలు చూస్తుంటే తాను చేసిన వ్యాఖ్యలనే తిప్పి కొట్టాలనిపిస్తోంది. సమంత తాజాగా సన్నాఫ్ సత్యమూర్తి, 24, జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో సమంత పాత్రకు ఉన్న ప్రాధాన్యం అంతంత మాత్రమే. జనతా గ్యారేజ్ అయితే శుద్ద వేస్ట్ క్యారెక్టర్. మొత్తంగా చూస్తే ఆ పాత్ర నిడివి పది నిమిషాలు కూడా ఉండదు.
ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తా అని చెబుతున్న సమంత ఈసినిమాలెందుకు ఒప్పుకొన్నట్టు?? నిజానికి మంచి పాత్రలే చేస్తా అని గిరిగీసుకొని కూర్చున్నప్పుడు ఇలాంటి పాత్రలు ఒప్పుకోకూడదు కదా? అల్లుడు శీను సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడీ కట్టింది సమంత. అదీ రెగ్యులర్ కథానాయిక పాత్రే. ఆ సినిమా కోసం ఏకంగా రూ.2 కోట్లు పారితోషికం అందుకొన్నట్టు వార్తలొచ్చాయి. సమంతకు సొమ్ములే ముఖ్యం అనే విషయం తేల్చడానికి ఇంతకంటే ఆధారాలు కావాలా? మరి ఎందుకు ఇలాంటి రివర్స్‌స్టేట్‌మెంట్లు ఇస్తోందో? దీనికైనా సమంత సమాధానం చెబుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



