'గాడ్ ఫాదర్'తో సీనియర్ హీరోయిన్ శోభన రీఎంట్రీ!
on Sep 27, 2021
మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ 'శోభన' తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది.
అప్పట్లో సౌత్ లో హీరోయిన్ గా శోభన ఒక వెలుగు వెలిగింది. తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన ఆమె.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ తో ఆడి పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితో కలిసి 'రుద్రవీణ(1988)', 'రౌడీ అల్లుడు(1991)' సినిమాలలో నటించిన ఆమె.. మళ్ళీ ఇన్నేళ్ళకు ఆయనతో కలిసి 'గాడ్ ఫాదర్' సినిమాలో నటించనుందని ప్రచారం జరుగుతోంది. మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం.
కాగా శోభన 2006లో మంచు విష్ణు హీరోగా వహ్చిన 'గేమ్' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఆ తరువాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే కానుంది.