చైతన్య- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మరో సినిమా!
on Sep 21, 2021
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ మూవీ ఈ నెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల మరో మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టొరీ'పై ముందు నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న శేఖర్ కమ్ముల.. తన తదుపరి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమా తర్వాత చైతన్య మరో సినిమా చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటిదాకా ఆయన ఏ హీరోతోనూ రెండోసారి వర్క్ చేయలేదు. దానికి భిన్నంగా 'లవ్ స్టోరీ' విడుదలకు ముందే చైతన్య- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో మరో సినిమా రానుందంటూ వార్తలు వస్తుండటంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
కాగా, చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా చేస్తున్నారు. అలాగే నాగార్జున 'బంగార్రాజు', ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రాలలోనూ నటిస్తున్నారు.
Also Read