మతం మార్చుకున్న సమంత?
on Sep 26, 2016

సమంత మతం మార్చుకొందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నాగచైతన్య తో సమంత వివాహం ఖాయం అయిన సంగతి తెలిసిందే. వచ్చే యేడాది వీళ్లిద్దరి పెళ్లి జరపనునన్నట్టు నాగచైతన్య, నాగ్‌లు కూడా చెప్పేశారు. త్వరలోనే నిశ్చితార్థం కూడా ఉండబోతోంది. ఇటీవల చైతూ - సమంతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమంతని క్రైస్తవమతం నుంచి హిందూ మతంలోనికి మార్చుకోవడానికే ఈ పూజలు నిర్వహించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. నాగ్ సన్నిహితులు మాత్రం.. ఇది కేవలం దోష నివారణ కోసం చేసిన పూజలు అంటున్నారు.
సమంత అంత సులభంగా మతం మార్చుకోవడానికి ఇష్టపడదని చెబుతున్నారు. అయితే నాగ్ సమక్షంలో సమంత, చైతూలకు వేద పండితులు మధ్య పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇవి కచ్చితంగా సమంత మత మార్పిడి పూజలే అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. సమంత పెళ్లి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరుగుతుందా? హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందా? అనే విషయంపైన సమంత మతం మారిందా, లేదా? అనే విషయం అంచనా వేయొచ్చు. అలా జరగాలంటే సమంత - చైతూల పెళ్లి ముహూర్తం ఎప్పుడో తేలాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



