సమంత..అంత ఎత్తుకు ఎదిగావామ్మా..?
on Apr 26, 2016

సమంతది కాస్త డేరింగ్ అండ్ డాషింగ్ మనస్తత్వమే. వన్ పోస్టర్ ని చూసి ఏకంగా మహేష్ బాబుపైనే కామెంట్ చేసింది. దాంతో మహేష్ ఫ్యాన్స్‌కీ, సమంతకూ ఓ వార్ లాంటిది నడిచింది. ఇప్పుడు ఏకంగా దర్శకులపై విరుచుకుపడింది. ''కథలపై ఎవ్వరూ దృష్టి పెట్టడం లేదు..కమర్షియల్ హంగులపైనే వాళ్ల ఫోకస్ అంతా పడిపోతోంది.. దాంతో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కథాబలమున్న చిత్రాలనే తీయండి..'' అంటూ దర్శకులకు క్లాస్ లాంటిది పీకింది. సమంత వచ్చి ఆరేళ్లే అయ్యింది. తన ఖాతాలోనూ అట్టర్ ఫ్లాపులున్నాయి. ఒకదశలో సమంత కెరీర్ ముగిసిపోయిందనుకొన్నారు.కానీ త్రివిక్రమ్‌లాంటి ఒకరిద్దరు దర్శకుల అండ వల్ల.. అవకాశాలు అందుకోగలుగుతుంది. అలాంటప్పుడు..కామ్‌గా ఉండాల్సింది పోయి.. దర్శకులపైనే సెటైర్ వేస్తే ఎలా? అంటూ కొంతమంది దర్శకులు సమంతకి టార్గెట్ చేస్తూ గుసగుసలాడుకొంటున్నారు. సమంతకు నవతరం కథానాయికల నుంచి గట్టి పోటీ ఉంది. చేతిలో ఉన్న బ్రహ్మోత్సవం, అఆ సినిమాలు కాస్త అటూ ఇటూ అయితే.. ఆమె కెరీర్ మళ్లీ డైలమాలో పడిపోతుంది. ఇలాంటప్పుడు సమంతకు ఇలాంటి కాంట్రవర్సీలు అవసరమా?? అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దర్శకులకు క్లాప్ పీకే స్థాయి సమంతకు ఉందా, లేదా? ఈ విషయం ఆమే కాస్త తెలుసుకొంటే మంచిదన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



