ఫ్లాష్ ఫ్లాష్: రెజీనా తల్లైయింది..!
on Nov 5, 2016
.jpg)
ఆగండి..ఆగండి మీరేదో ఊహించుకోకండి..తెలుగు, తమిళ భాషాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే బిజీ అవుతోన్న రెజీనా తల్లయిందా..? ఇంతవరకు పెళ్లే అవ్వలేదు..? ఇదేలా సాధ్యం అని మీ మైండ్‌లో రన్ అవుతోంది కదా..? వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం రెజీనా తమిళ్‌లో "నెంజం మరప్పథిల్లై" అనే సినిమా చేస్తోంది. దీనిలో దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధానపాత్రలో నటిస్తుండగా.. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో రెజీనా ఓ బాబుకు తల్లిగా కనిపించనుంది. అలాగే ఆమెది దెయ్యం పాత్ర. కథ విషయానికి వస్తే..రెజీనా-సూర్య భార్యభర్తలు. ఒక సందర్భంలో రెజీనా పాత్ర హత్యకు గురవుతుంది. ఆ తర్వాత పిల్లాడి కోసం రెజీనా ఆత్మగా తిరిగి వస్తుంది. సూర్య రెండో పెళ్లి చేసుకుంటాడు. అసలు రెజీనా హత్యకు కారణం ఏమిటి.? హత్య చేసిన వారిపై పగ ఎలా తీర్చుకుంటుంది అన్నదే సినిమా..? సో అసలు మ్యాటర్ అదన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



