రెజీనాకు బంపరాఫర్.. ఆ క్రేజీ వెబ్ సిరీస్ లో ఛాన్స్!
on Sep 23, 2021
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ విడుదలై సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రెండు సీజన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సిరీస్ సృష్టికర్తలు రాజ్- డీకే లకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ జోష్ తో మరో క్రేజీ సిరీస్ ని రూపొందిస్తున్నారు. అయితే హీరోయిన్ రెజీనా కాసాండ్రా ఈ సిరీస్ లో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, రాశీఖన్నా లతో రాజ్- డీకేలు ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ రెజీనా దక్కించుకుందని తెలుస్తోంది. ఇందులో ఆమె విజయ్ సేతుపతి భార్యగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ సిరీస్ షూటింగ్ కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది. త్వరలోనే ఈ సిరీస్ సెట్ లో రెజీనా అడుగుపెట్టనుందని సమాచారం.
రెజీనా ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకిని- ఢాకిని' సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది.
Also Read