కిక్ కాంబోలో మూవీ.. రవితేజ మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడా?
on Dec 16, 2025

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఓ సాలిడ్ సక్సెస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దీని తర్వాత రవితేజ.. తనకు 'కిక్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డితో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
2009లో రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'కిక్' ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 2015లో వీరి కాంబోలో వచ్చిన 'కిక్-2' మాత్రం పరాజయం చూసింది. ఏకంగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ చేతులు కలపబోతున్నట్లు సమాచారం.
Also Read: షాకింగ్.. అప్పుడే ఓటీటీలోకి మోగ్లీ..!
2023లో వచ్చిన 'ఏజెంట్' తర్వాత సురేందర్ రెడ్డి నుంచి సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశమొచ్చినా అది పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. సురేందర్ రెడ్డి మెజారిటీ సినిమాలకు రచయితగా పని చేసిన వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడట. ఇది 'కిక్-3' అనే ప్రచారం కూడా జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మూవీ రూపొందనుందట.
రవితేజ, సురేందర్ రెడ్డి.. ఇద్దరికీ ఇప్పుడు హిట్ అవసరం. మరి వీరి కాంబోలో రానున్న ఈ మూవీ.. ఇద్దరికీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



