హాలీవుడ్ బ్యూటీతో ప్రభాస్?
on May 13, 2021
పాన్ ఇండియా మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ఓ హాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్నారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ క్రేజీ
ప్రాజెక్ట్.. 2022 చివరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వినికిడి. అంతేకాదు.. కథానుసారం ఇందులో విదేశీ భామ పాత్రకి స్థానం ఉందట. ఈ నేపథ్యంలోనే.. ఓ హాలీవుడ్ సుందరిని నటింపజేసే ఆలోచనలో
ఉన్నాడట దర్శకుడు సిద్ధార్థ్. మరి.. ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆది పురుష్', నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ ఉన్నాయి. ఇక సిద్ధార్థ్ ఆనంద్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో 'పఠాన్' మూవీ
చేస్తున్నాడు.