పవన్ ఒడ్డున పడేస్తాడా..?
on Feb 28, 2017

బండ్ల గణేష్..సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కాలాన్ని గడిపిన బండ్ల గణేష్ ఉన్నట్లుండి నిర్మాతగా మారిపోయాడు. ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన టెంపర్ తర్వాత మనోడు సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఏ కొత్త ప్రాజెక్ట్ ఏనౌన్స్ చేయలేదు. దీనిపై పరిశ్రమలో రకరకాల పుకార్లు వినిపించాయి.
బండ్ల అప్పుల పాలయ్యాడని..అతనికి డబ్బు స్పాన్సర్ చేస్తున్న వారు ముఖం చాటేశారని కథనాలు వచ్చాయి..అయితే రీసెంట్‌గా కాటమరాయుడు సెట్‌లో బండ్ల సందడి చేశాడు. పవన్‌తో కలిసి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే ఆ పిక్ వైరల్ అవుతోంది. ఉన్నట్లుండి గణేష్ పవర్‌స్టార్‌ని ఎందుకు కలిశాడు..వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా ఏమైనా చేస్తున్నాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు అభిమానులు. మరి దీనికి సంబంధించిన నిజానిజాలు బయటకు రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



