ఎన్టీఆర్ పోటీ నుంచి తప్పుకున్నాడు..!
on Dec 17, 2014
.jpg)
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్‌ల ‘టెంపర్’సంక్రాంతి పోటీ నుంచితప్పుకున్నట్లు సమాచారం.‘టెంపర్’షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం ఎదురవుతున్నా తట్టుకుంటూ రేయింబవళ్లు కష్టపడుతూ వస్తున్న ఫలితం లేకపోయింది. అన్నయ్య జానకిరామ్ మృతితో విషాదంలో మునిగిపోయిన ఎన్టీఆర్, ఇప్పడిప్పుడే షూటింగ్‌లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో ‘టెంపర్’ షూటింగ్ సకాలంలో పూర్తి చేసి.. ముందుగా అనుకున్నట్లు జనవరి 9న విడుదల చేసే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఈ సినిమా పొంగల్ రేస్‌లోంచి తప్పుకున్నట్టే. సంక్రాంతి మిస్ అవడంతో మళ్లీ మంచి సీజన్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాలకి బెస్ట్ సీజన్ సమ్మర్ కనుక అంత వరకు ‘టెంపర్’ రాకపోవచ్చునట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



