ఎన్టీఆర్ 'డ్రాగన్' కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
on Dec 14, 2025

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' టైటిల్ పరిశీలనలో ఉంది. (NTR Neel)
డ్రాగన్ సినిమాని 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఆ తేదీకి విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అది మిస్ అయితే.. 2027 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
కొంత విరామం తరువాత డ్రాగన్ షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఈ డిసెంబర్ 13 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. నెలరోజుల పాటు హైదరాబాద్, జోధ్‌పూర్ లో షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎన్టీఆర్-రుక్మిణి వసంత్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత విదేశాల్లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



