డేటింగ్ కి రెఢీ అంటున్న నిత్యా!
on Jun 8, 2015
.jpg)
పొట్టిపిల్ల నిత్యామీనన్ పై ఓకే బంగారం సినిమా ఎఫెక్ట్ బాగానే పడినట్టుంది. ఏవిషయమైనా ముఖంమీదే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఈ కేరళకుట్టి డేటింగ్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ముక్కు మొహం తెలియని వాడితో జీవితాన్ని పంచుకుంటూ సర్దుకుపోయే కన్నా నచ్చినవాడితో సహజీవనం చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్న వేస్తోంది. అయినా నేటి యువత స్వేఛ్చ కోరుకుంటోందని ... వివాహం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే అనే అని ఒక్క ముక్కలో తేల్చిపడేసింది. అంతేనా సహజీవనం చేయడం వల్ల ఆ వ్యక్తి మనస్తత్వం తెలుస్తుంది...ఎటువంటి వాడు అభిరుచులు ఏంటి ? రేపు అతడి వల్ల ఇబ్బందులు ఏమైనా వస్తాయా ? లేదా అన్నది తెలుస్తుందంటోంది. ఈ లెక్కన నిత్యామీనన్ డేటింగ్ కి రెఢీ అన్నమాట. ఇంతకీ కుర్రాడెవరో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



