నయనతార నిప్పే లేదంటుంది
on May 27, 2015
నిప్పులేనిదే పొగ రాదంటారు పెద్దలు కానీ నయనతార మాత్రం నిప్పే లేదు పొగ మాత్రం ఊరికే వచ్చింది అంటుంది. అసలు నిప్పేంటి.. పొగెంటీ అనుకుంటున్నారా సంగతేంటంటే.. నయనతార.. ఈ అమ్మడు ఇప్పటికే ఇద్దరితో లవ్ బ్రేకప్ అయిపోయి ప్రేమ వ్యవహారంలో దెబ్బతిని ఇంకెప్పుడూ ప్రేమించనని చెప్పింది. కానీ మళ్లీ గణేష్ శివ అనే దర్శకుడితో ప్రేమలో పడినట్టు, వాళ్లిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడానికి మాల్దీవులకు వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి. నయనతార మాత్రం ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని, అంతా మీడియా సృష్టించిన పుకార్లేనని కొట్టిపారేసింది. అయితే మరి నయనతార గణేష్ శివతో కలిసి ఎందుకు మాల్దీవులకు వెళ్లినట్టు అని ఇప్పుడు అందరి సందేహం. ఏది ఏమైనా ఇప్పటికే ప్రేమలో అనేక పాట్లు పడిన నయనతార ఇంతకీ గణేష్ శివతో లవ్ లో ఉందా? లేదా? అనేది మాత్రం సమాధానం లేని ప్రశ్న.