మహేశ్ ని ఢీ కొట్టనున్న నందమూరి హీరో!?
on May 27, 2022
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త చిత్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ఓ హీరో.. నెగటివ్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. మహేశ్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `అతడు`, `ఖలేజా` వంటి కల్ట్ క్లాసిక్స్ తరువాత మహేశ్, త్రివిక్రమ్ జట్టుకడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే కథానాయికగా నటించనుండగా, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో కథానాయకుడు నందమూరి తారకరత్న ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. అంతేకాదు.. ఇదో నెగటివ్ క్యారెక్టర్ అని సమాచారం. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ చిత్రంలో తారకరత్న ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే, తారకరత్న గతంలో `అమరావతి` చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడమే కాకుండా `బెస్ట్ విలన్`గా `నంది` అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు.