ప్రతీకారానికి బలైన "మనం"..?
on Nov 15, 2017
.jpg)
ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకప్పుడు బాగానే ఉండేవారు లేండి. ఏమైందో ఏమో కానీ.. ఈ మధ్య పలుక్కోవడం లేదు. ఇద్దరి మద్యా తడిసిన దూది వేసినా... భగ్గుమనే పరిస్థితి.
అనుకోకుండా వీరిద్దరూ ... ఒకేపోటీలో పాల్గొన్నారు. విధి ఆడిన వింత నాటకం.. ఆ పోటీలో వీరిద్దరే ప్రధాన పోటీ దారులయ్యారు. వీరిద్దరిలో ఒకాయనకు పలుబడి ఎక్కువ. దాంతో రెండో ఆయనకు దెబ్బడిపోయింది. అందుకే అంటారు.. ‘పవర్’ తో పెట్టుకోకూడదు అని. పెట్టుకుటే ఏమవుతుంది... షాక్ కొడుతుంది.
ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరా? అనుకుంటున్నారా? ఇంకెవరూ... మన బాలయ్య. మన నాగ్. పాపం... నాగ్ ‘మనం’.. ఎంత మంచి సినిమా అండీ..! విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమా. మహానటుడు అక్కినేని చివరి సినిమా. అద్భుతమైన కథ. రసవత్తరమైన స్క్రీన్ ప్లే. కళ్లు చమర్చే భావోద్వేగాలు... ద్వందార్థాలు ఉండవ్. రక్తపాతాలుండావ్... అనవసరపు బిల్డప్ షాట్స్ ఉండవ్.. ఊహకందని సన్నివేశాలుండవ్. చక్కగా నేలపై నడిచే కథ. అలాంటి సినిమాకు ప్రథమ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయాల్సింది పోయి.. రెండో స్థానంతో సరిపెట్టారు. ఫస్ట్ ఫ్రైజ్ బాలయ్య ‘లెజెండ్’ కి ఇచ్చేశారు. అంతటితో ఆగారా? ఏకంగా తొమ్మిది అవార్డులు ‘లెజెండ్’కే సమర్పించుకున్నారు. వీరి స్వామిభక్తి తగలెయ్య.. మరీ ఇంత స్వామి భక్తా!.
పవర్ పని చేస్తే అలా ఉంటుంది మరి. అంటే.. స్వయంగా బాలయ్యే ఈ వ్యవహారం నడిపించాడని అనడం లేదు. ఆయన కాకపోయినా ... ఆయన ఆశీస్సుల కోసం కమిటీ పెద్దలే నాగ్ కి అన్యాయం చేసుండొచ్చుగా!. ఇది మా అభిప్రాయం కాదండోయ్. బయట మీడియా అంతా కోడై కూస్తోంది.
ఏపీలో అవార్డులు కావాలనుకుంటున్నారా? అయితే... బాలయ్యకు శరణం పలకండి. బాలయ్యతో సినిమాలు తీయండి. కచ్చితంగా అవార్డలు మీ వెంటే. అంటూ సోషల్ మీడియాలో కథనాలే వెలువడుతున్నాయ్. అదండీ సంగతి. పాపం.. ఏది ఏమైనా... నాగ్ కి మాత్రం అన్యాయం జరిగిపోయిందండి. ఏమంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



