శుభకార్యంలో కూడా నాగ్-బాలయ్య కలవలేదా..?
on Nov 13, 2017
.jpg)
తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. వృత్తిపరంగా పోటీపడినా.. వ్యక్తిగతంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ తుది వరకు అన్నదమ్ముల్లా మెలిగారు. వారి మధ్య అభిప్రాయభేదాలు రావడమన్నది చాలా అరుదు. వారి తనయులు బాలకృష్ణ, నాగార్జున ఎన్నో ఏళ్లుగా టాప్ హీరోలుగా చెలామణి అవుతున్నప్పటికీ వారు కూడా స్నేహితుల్లానే మసలుతూ వచ్చారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ.. కొద్ది రోజులుగా నాగ్, బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. వారి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా మంది ప్రయత్నించినా కుదరలేదు.
ఇలాంటి తరుణంలో నాగచైతన్య వివాహ రిసెప్షన్‌కు బాలయ్య హాజరవుతారని అందరూ భావించారు. కానీ బాలయ్య లేకపోవడం వారందరినీ తీవ్రంగా బాధించిందట. ఆదివారం ఎన్.కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నాగచైతన్య-సమంత రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు.. నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ కూడా వచ్చారు.. అయితే బాలయ్యగానీ, ఆయన కుటుంబసభ్యులుగానీ ఎవరూ ఈ వేడుకలో కనిపించలేదు. దీనిని బట్టి నాగ్-బాలయ్యల మధ్య విబేధాలు తొలగిపోలేదని అంటున్నారు విశ్లేషకులు. అసలు ఇంతగా వీరి మధ్య అంతరం ఏర్పడటానికి కారణమేమిటో..? మళ్లీ వీరిద్దరిని ఒకే వేదిక మీద ఎప్పుడు చూస్తామో కాలమే నిర్ణయించాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



