మహేశ్ వద్దన్నాడు.. మరి బాలయ్య ఎలా ఒప్పుకున్నాడు..?
on Mar 9, 2017
నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇవాళ ప్రారంభమైంది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక విజయం తర్వాత తన 101వ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయాలా అని బాలయ్య తర్జన భర్జనలు పడ్డారు. అయితే శాతకర్ణి సెట్ మీద ఉండగానే కృష్ణవంశీ చెప్పిన రైతు కథ బాలకృష్ణకు బాగా నచ్చింది..దీనికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆ వెంటనే కీలక పాత్ర కోసం బిగ్‌బిని కలవడం అన్ని చకచకా జరిగిపోయాయి. కాని ఏం జరిగిందో ఏంటో తెలియదు కాని ఆ ప్రాజెక్ట్ అటకమీదకు ఎక్కేసింది.
ఆ వెంటనే బాలయ్యకు కథలు చెప్పేందుకు అనేక మంది దర్శకులు క్యూకట్టారు. కాని ఏ ఒక్కరు నటసింహాన్ని సంతృప్తిపరచలేకపోయారు. అయితే ఎవ్వరూ ఊహించకుండా పూరి జగన్నాథ్ బాలయ్యని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇంతకి పూరి ఏ కథను వినిపించాడు..దేనికి బాలయ్య ఇంప్రెస్ అయ్యాడో తెలియదు గానీ ఇప్పడు అదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే బిజినెస్‌మెన్ సినిమాకు ముందు మహేశ్‌కు వినిపించిన రెండు కథల్లో ఒకదానిని ప్రిన్స్ ఓకే చేశాడు..అదే బిజినెస్‌మెన్. ఆ రెండో కథకు మాత్రం సరైన రెస్పాన్స్ రాకపోవడంతో దానిని అటకమీదకు ఎక్కించాడట. అయితే ఆ కథను బాలయ్యకు వినిపించగానే ఆయన వెంటనే ప్రోసీడ్ బ్రదర్ అన్నారట. అది మెసేజ్ ఓరియేంటేడ్ స్టోరీ కావడమే దానికి కారణం. బాలయ్య ఇమేజ్‌కు, వయసుకు ఆ స్టోరీ సరిగ్గా సెట్ అవుతుదంట. ఏది ఏమైనా బాలయ్య లాంటి అగ్రకథానాయకుడిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో పూరి గాల్లో తేలుతున్నాడు.