చిరంజీవిని చంపుతాడట.. ఎంత ధైర్యం!
on Sep 9, 2017

మంచి రోజులు మొదలైతే.. దాని ప్రభావం బలంగా కనిపిస్తుంది. జగపతిబాబు విషయంలో అదే జరుగుతోంది. వరుసగా అద్భుతమైన అవకాశాలు జగ్గూభాయ్ ని వరిస్తున్నాయ్. జగపతిబాబు హవా ప్రస్తుతం దక్షిణాది మొత్తం కనిపిస్తోందంటే నమ్మాతారా? అందుకేనేమో... మెగాస్టార్ ‘సైరా’లో అద్భుతమైన పాత్ర జగ్గూభాయ్ ని వరించింది.
చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో కథకు వెన్నెముక లాంటి పాత్రను జగపతిబాబు పోషిస్తున్నాడట. విజయ్ సేతుపతి, సత్యరాజ్, సుదీప్, నాజర్... ఇలా మహామహులు నటిస్తున్న ఈ చిత్రంలో... వీరందరి పాత్రలకంటే కీలకమైన పాత్ర జగ్గూభాయ్ నే వరించిందటే.. మనోడి అదృష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నరసింహారెడ్డి మరణానికి జగపతిబాబు పాత్రే కారణమవుతుందట. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రనూ, చిరంజీవి పాత్రకు దీటైన పాత్రనూ... ఇందులో జగ్గూభాయ్ పోషించనున్నాడట. చిరంజీవి మాత్రమే కాదు... జగపతిబాబు నటిస్తున్న తొలి చారిత్రాత్మక చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



