చిరంజీవితో క్రిష్‌కు కుదురుతుందా..?
on Feb 22, 2017

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్ రీఎంట్రీ అదిరిపోయింది. ఆయన 150వ చిత్రం ఖైదీ నెం.150 రికార్డు కలెక్షన్లతో చిరంజీవి స్టామినా ఎంటో చూపించింది. సరే ఇప్పుడు ఇదంతా గతం..చిరంజీవి 151 చిత్రం ఎవరితో చేస్తాడు..కథ ఎలా ఉండబోతుంది అంటూ రకరకలా క్వశ్చన్స్ మెగా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీనులతో సినిమాలు చేసేందుకు మెగా కాంపౌండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్యకు హిస్టారికల్ హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్‌తో సినిమా చేసేందుకు చిరంజీవి రెడీ అయినట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిరు, క్రిష్ ఇద్దరిది వేరు వేరు శైలి. చిరు కమర్షియల్ చిత్రాలు చేయడానికే ఇష్టపడతాడు..క్రిష్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ చేస్తాడు..మరి వీరిద్దరికి ఎలా కుదురుతుందన్నదే ప్రశ్న. మెగాస్టార్ కోరిక మేరకు క్రిష్ కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాకు ఓకే అంటాడా..లేదంటే తన మార్క్ చిత్రంలో చేయడానికి చిరంజీవిని క్రిష్ ఒప్పిస్తాడా..? మొత్తానికి ఈ కాంభినేషన్ సెట్ అయితే మాత్రం అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



