మారుతి దర్శకత్వంలో మెగాస్టార్!!
on Aug 3, 2021
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్, బాబీ ప్రాజెక్ట్, మెహర్ రమేష్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఇక తాజాగా మరో ప్రాజెక్ట్ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
2012లో విడుదలైన యూత్ ఫుల్ మూవీ 'ఈరోజుల్లో'తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ తరువాత పలు హిట్ మూవీస్ అందించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే నాని, శర్వానంద్, నాగ చైతన్య వంటి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరో వెంకటేష్ ని డైరెక్ట్ చేసిన మారుతి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మారుతి.. చిరంజీవికి ఓ స్టోరీని వినిపించగా అది ఆయనకు నచ్చి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఇన్నాళ్లకు కుదిరిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించే అవకాశాలున్నట్లు సమాచారం.