మళ్లీ బ్రాహ్మణులతో పెట్టుకుంటున్న మంచు విష్ణు
on Mar 13, 2017
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ సినిమా సూపర్‌హిట్టయ్యి ఫ్లాపులతో సతమతమవుతున్న విష్ణుకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. అయితే "దేనికైనా రెడీ" సినిమా సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆ సామాజిక వర్గం నాటి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది.
సినిమా విడుదలైనప్పటి నుంచి నాలుగు వారాల పాటు ఈ వివాదం మోహన్‌బాబు vs బ్రాహ్మణులుగా మారింది. చివరకు కేసులు, కోర్టులు, సెన్సార్ బోర్డుల వరకూ వెళ్లింది. అయితే ఇరు పక్షాలు రాజీకి రావడంతో వివాదం ముగిసింది. తాజాగా విష్ణు మళ్లీ బ్రాహ్మణులతో తలపడేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. జి.నాగేశ్వర్‌రెడ్డి-విష్ణు కాంబినేషన్‌లో త్వరలో ఓ మూవీ తెరకెక్కనుంది. దీనికి "ఆచారి అమెరికా యాత్ర" అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో దేనికైనా రెడీకి కూడా నాగేశ్వర్ రెడ్డే డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ఆచారికి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తుండటంతో మళ్లీ దీనిపై ఎలాంటి రచ్చ జరుగుతోందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
