పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. 'కింగ్డమ్' వాయిదా..?
on May 6, 2025
"ఎక్కడో జరిగే ఓ మూమెంట్.. ఇంకెక్కడో జరిగే మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది" అన్నట్టుగా.. ఒక్కోసారి ఎవరో సినిమా వల్ల, ఇంకెవరో సినిమా వాయిదా పడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' విషయంలో అదే జరిగే అవకాశం కనిపిస్తోంది.
విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'కింగ్డమ్'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, మే 30కి వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీంతో ఇక మే 30కి 'కింగ్డమ్' రావడం ఖాయమని విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో 'కింగ్డమ్' వాయిదా పడనుందనే వార్త ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' అని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం మొదలైన 'వీరమల్లు' ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. మే 9న విడుదల కావాల్సి ఉండగా.. మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పట్లో కొత్త రిలీజ్ డేట్ లాక్ అయ్యే అవకాశం లేదని భావించారంతా. ఇలాంటి సమయంలో అనూహ్యంగా పవన్.. తన మూడు నాలుగు రోజుల పెండింగ్ షూట్ ని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు. దీంతో 'వీరమల్లు' సినిమా దాదాపు రెడీ అయినట్లే. ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ, ఓటీటీ అగ్రిమెంట్ కారణంగా ఈ నెలలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. దీంతో మే 30 డేట్ ని లాక్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే 'కింగ్డమ్' నిర్మాతలతో 'వీరమల్లు' మేకర్స్ చర్చించినట్లు టాక్. 'కింగ్డమ్' నిర్మాతలు పవన్ కి సన్నిహితులే. నాగవంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పవన్ సినిమా వస్తుందంటే.. తమ సినిమాని వాయిదా వేసుకోవడానికి వారు ఏమాత్రం ఆలోచించరు. 'వీరమల్లు' నిజంగానే మే 30కి రావాలనుకుంటే, 'కింగ్డమ్' వాయిదా పడినట్లే. జూన్ లేదా జూలైలో కొత్త విడుదల తేదీని వెతుక్కునే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
