శ్రీలీల తల్లిగా కాజల్... అప్పుడే మదర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారా?
on Mar 16, 2023
కాజల్‌కి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయం ఫిల్మ్ నగర్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తె రోల్‌లో శ్రీలీల కనిపిస్తారట. రీసెంట్‌గా కాజల్ నటిస్తున్న సినిమాల వివరాలను తెలుపుతూ, ఓ చెన్నై మీడియా హౌస్ బాలయ్య మూవీ పేరును కూడా ప్రస్తావించింది. ఈ లెక్కన కాజల్ ఇప్పుడు ఏ పాత్రలో నటిస్తున్నట్టు? అనే విషయం వైరల్ అవుతోంది.
నందమూరి బాలకృష్ణతో జోడీ కడితే శ్రీలీలకు కాజల్ అమ్మగా నటిస్తారా? లేకుంటే బాలయ్య రెండు గెటప్పుల్లో ఉంటే, యంగ్ గెటప్‌కి హీరోయిన్‌గా కనిపిస్తారా? అనేది ఆసక్తికరమైన చర్చ. ఇదో వైపుంటే, ఇంకోవైపు కాజల్ గ్లామర్ రోల్స్ కి నో చెబుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదంటోంది కాజల్ కాంపౌండ్. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తి వేరు. ఆ విషయాల గురించి కాజల్‌కి స్పష్టమైన అవగాహన ఉంది. పెళ్లయ్యీ కాగానే, కమిట్‌మెంట్‌తో ఆచార్య సెట్లో అడుగుపెట్టిన నటి కాజల్. కాబట్టి అర్థంపర్థం లేని కండిషన్స్ ఆమె పెట్టరు. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలనుకునే తత్వం ఆమెది అంటూ అటు వైపు నుంచి వకాల్తా పుచ్చుకుంటున్నారు కాజల్ తరఫువారు.
ఇప్పుడు ఇండియన్2లో కాజల్ నటిస్తున్నారు. కమల్‌హాసన్ పక్కన కాజల్‌ది వయోధిక పాత్రే. ఆమె పాత్రకోసం మేకప్ వేయడానికి, తీయడానికే చాలా సమయం పడుతోందట. కమల్ పక్కన నటిస్తున్నట్టే, బాలయ్య పక్కన కూడా వయోధిక గెటప్‌లో ఏమైనా కనిపిస్తారా? అనే అనుమానాలు కూడా మరోవైపు లేకపోలేదు. కాజల్ తనంతట తాను ఓపెన్ అయ్యి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవరకు ఇటువంటి చర్చలు కామనే మరి.
Also Read