ఎన్టీఆర్ అంతకు దిగజారతాడా..? నో ఛాన్స్..?
on Jul 10, 2017

బాబీ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ జై లవకుశ..కెరీర్‌లో తొలిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండటం..విలన్ కూడా జూనియరే కావడంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ అందరి ప్రశంసలు అందుకుంది. జై క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్‌తో టీజర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేశాడు ఎన్టీఆర్. ఇలాంటి హ్యాపి మూవ్‌మెంట్లో ఒక జై లవకుశ ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
అదేంటంటే..టీజర్‌లో చూపించిన జై క్యారెక్టర్ సృష్టికర్త బాబీ కాదట..డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత జై లవకుశను ఓకే చేయడానికి ముందు ఎన్టీఆర్‌కు పూరీ ఒక కథ చెప్పారట..ఆ కథలో ఒక పాత్ర జై క్యారెక్టర్‌ను పోలి ఉంటుందట. ఆశ్చర్యకరంగా ఆ పాత్రకూ నెత్తి, నెగిటీవ్ షేడ్ ఉంటాయని ఫిలింనగర్‌లో ఒకటే టాక్..ఆ తర్వాత బాబీ చెప్పిన కథలో "జై" ని ఎన్టీఆర్ ఇరికించారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిలో నిజానిజాలు తెలియాలంటే బాబీ కానీ పూరీ కాని వివరణ ఇవ్వాల్సిందే. ఒకవేళ నిజమైతే మాత్రం పూరీకి, ఎన్టీఆర్‌కు తేడా వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు సినీ జనాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



