కరీనా ప్రెగ్నెంట్ కాదట..?
on Sep 21, 2016

అప్పట్లో నేను తల్లి కాబోతున్నానంటూ కుటుంబసభ్యులతో పాటు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. బేబి బంప్‌తో ర్యాంప్ వాక్ చేసి ఆ తర్వాత ఉద్వేగభరితంగా మాట్లాడి అందరిని కంటతడి పెట్టించింది కరీనా..అయితే తాజాగా తాను ప్రెగ్నెంట్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది..అదేంటి అప్పుడలా ఎందుకు చెప్పింది..? ఇప్పుడిలా ఎందుకంటోందో అర్థంకాక జనాలు బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. అసలు మ్యాటరేంటంటే కరీనా లేటేస్ట్ మూవీ "వీరె ది వెడ్డింగ్"లో ఆమె గర్భవతిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన కరీనా..తాను ఆ సినిమాలో గర్భవతిని కాదని స్పష్టం చేశారు. సో మ్యాటర్ అదన్నమాట. నలుగురమ్మాయిల కథతో రూపొందుతున్న ఈ సినిమాలో కరీనాకపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖా నటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



