చరణ్-బుచ్చిబాబు సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్!
on Mar 21, 2024
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. గతంలో వచ్చిన శంకర్ మార్క్ సినిమాగా ఉంటూనే రామ్‌చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ‘గేమ్ ఛేంజర్’ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందే సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరోగా శివరాజ్‌కుమార్‌ను కన్‌ఫర్మ్ చేశారు. వీరితో పాటు ఒక బాలీవుడ్ స్టార్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంజయ్ దత్‌కి తన క్యారెక్టర్‌కి సంబంధించిన నేరేషన్ ఇచ్చారని సమాచారం. ఆ క్యారెక్టర్ చేసేందుకు సంజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో సంజయ్ విలన్‌గా నటించే అవకాశం ఉందట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ‘కెజిఎఫ్2’ తర్వాత సంజయ్ దత్‌ని తమ సినిమాల్లో తీసుకునేందుకు సౌత్ దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ హీరోగా వచ్చిన ‘లియో’లో తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్న సంజయ్ ‘రాజా సాబ్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్ కొత్త సినిమాలో కూడా అతను నటించబోతున్నాడనే వార్తతో మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. మార్చి 27 చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ చేస్తారట. ఈ టైటిల్‌ని మొదట ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేశాడు బుచ్చిబాబు. చరణ్‌తో చేయబోతున్న సినిమా కథకి ‘పెద్ది’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందన్న ఉద్దేశంతో అదే టైటిల్‌ని ఈ సినిమా పెట్టాలని అనుకుంటున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మొదటిసారి రామ్‌చరణ్ సినిమాకి సంగీతాన్ని అందించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
Also Read