భరత్, సంజన లవ్ ఎఫైర్ ముదిరిందట
on Jul 7, 2011
భరత్, సంజన లవ్ ఎఫైర్ బాగ ముదిరిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బోయ్స్" చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి, ప్రేమిస్తే చిత్రం ద్వారా హీరోగా వెలుగులోకి వచ్చిన యువ హీరో భరత్ కీ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "బుజ్జిగాడు" మేడిన్ చెన్నై చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన కన్నడ భామ సంజనల మధ్య ప్రేమ ముదిరి పాకాన పడిందట. సంజన ఇటీవల నటించిన "దుశ్శాసన" చిత్రం కూడా చక్కని ఫ్లాప్ గా నిలిచింది.
కన్నడంలో, తమిళంలో, తెలుగులో కూడా సినిమాల్లేవు. కానీ ఎప్పుడూ మీడియాలో తన పేరు వినపడాలనుకునే సంజన ప్రస్తుతం భరత్ ని వల్లో వేసిందనీ, చెన్నైలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కలసి తిరుగుతున్నారనీ కోలీవుడ్ వర్గాలంటున్నాయి. మరి వీరిద్దరి ప్రేమ వ్యవహారం ప్రేమగానే మిగులుతుందా, లేక పెళ్ళివరకూ వెళుతుందా అనేదే మిలియన్ డాలర్ ప్రశ్న.