అంజలి రాజ్ తరుణ్ ని వాడుకుంది అందుకేనా?
on Mar 16, 2017

అప్పుడెప్పుడో జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు జై, అంజలి. ఆ సినిమా తెచ్చిన నేమ్‌తో అంజలి టాలీవుడ్‌లో జెండా పాతింది. కాని జై మాత్రం కోలీవుడ్‌కే పరిమితమయ్యాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట ఓ తమిళ సినిమా చేస్తోంది..బెలూన్ అనే పేరుతో సినీష్ అనే కొత్త డైరెక్టర్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. హర్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జై మూడు వేరియేషన్లలో కనిపిస్తాడట. దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు.

తమిళ్ వరకు పర్లేదు కాని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సినిమాలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి. అందుకే ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్‌తో చిన్న కామియో రోల్ చేయించాలనుకున్నాడట డైరెక్టర్ సినీష్..దీనిలో భాగంగా యంగ్‌హీరో రాజ్‌తరుణ్‌ని కలిసి రిక్వెస్ట్ చేశాడట. దీనికి ఓకే అన్న రాజ్, రీసెంట్‌గా చెన్నై వెళ్లి ఒక రోజు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి వచ్చేశాడట. అసలు అతిథి పాత్రలు చేయనని చెప్పిన తరుణ్ ఎవరి కోసం..ఎందుకోసం ఒప్పుకున్నాడోనని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



