'హిట్ 4'లో బాలకృష్ణ, రవితేజ..!
on Jan 29, 2025
నానికి చెందిన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందే 'హిట్' ప్రాంఛైజ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించే ఈ ప్రాంఛైజ్ లో ఇప్పటిదాకా రెండు సినిమాలు రాగా.. రెండూ మంచి విజయం సాధించాయి. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ నటించారు. మూడో భాగంలో నాని నటిస్తున్నాడు. ప్రస్తుతం 'హిట్-3' చిత్రీకరణ దశలో ఉంది. మే 1న విడుదల కానుంది. అయితే 'హిట్-3' విడుదల కాకముందే, అప్పుడే 'హిట్-4' గురించి చర్చ మొదలైంది.
'హిట్-2' చివరిలో నాని పాత్రను పరిచయం చేసి, 'హిట్-3'కి లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'హిట్-3' చివరిలో కూడా ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేసి, 'హిట్-4'కి లీడ్ ఇవ్వబోతున్నారట. అంతేకాదు ఈ హిట్ ప్రాంఛైజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో.. 'హిట్-4'లో లీడ్ రోల్ కోసం మరో స్టార్ ని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ 'హిట్-3' క్లైమాక్స్ లోనే ఎంట్రీ ఇస్తాడని సమాచారం.
అంతేకాదు 'హిట్-4'లో నటించనున్న స్టార్ నందమూరి బాలకృష్ణ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలాగే కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. ఈ క్రమంలో హిట్ ప్రాంఛైజ్ లో బాలకృష్ణ భాగమైతే కొత్తగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'హిట్-4'లో నటించే స్టార్ అంటూ మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ స్టార్ ఎవరో కాదు రవితేజ. అయితే 'హిట్-4'లో రవితేజ నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం బాలకృష్ణ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మరి 'హిట్-4'లో నిజంగానే బాలకృష్ణ భాగమవుతారా? లేక వేరే స్టార్ ఎవరైనా ఎంట్రీ ఇస్తారా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)