బాహుబలి-2లో రాజమౌళి సరిదిద్దుకోలేని లోపాలు
on May 1, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉత్కంఠకు తెరపడింది. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పి భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచి బాహుబలి ద బిగినింగ్‌కు కొనసాగింపుగా వచ్చిన బాహుబలి ద కన్‌క్లూజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పార్ట్ 1 కన్నా హై టెక్నికల్ వాల్యూస్‌తో పార్ట్-2ని తెరకెక్కించారు రాజమౌళి. జక్కన్నతో పాటు వేలాది మంది టెక్నీషియన్ల శ్రమ తెరపై కనిపించింది. రాజతంత్రాలు, కుతంత్రాలు, కుయుక్తులు వగైరా అంశాలతో ఎంగేజింగ్ కాస్ట్యూమ్ డ్రామాగా బాహుబలిని తీర్చిదిద్దిన తీరు అద్భుతం.
ఎంత తెలివైన దర్శకుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేయడం సహజం..దీనికి జక్కన్న కూడా అతీతం కాదు. సినిమా ఇప్పటికే లేట్ అయ్యిందనుకున్నాడో లేదంటే ఎడిటింగ్ మీద సరిగా కాన్సన్‌ట్రేట్ చేయలేదేమో కానీ బాహుబలి-2లో చాలా తప్పులు దొర్లాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ..పాత్రల మధ్య సమన్వయం కుదర్చడంలో రాజమౌళి విఫలమయ్యాడు. ఇప్పుడు ఆ సమాధానం దొరకని ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అవేంటో ఒకసారి చూస్తే:
* బాహుబలి బిగినింగ్‌లో భల్లాలదేవుడి కొడుకు భద్ర తల నరుకుతాడు శివుడు..రెండో భాగంలో భల్లాలదేవుడి వివాహం, భార్యకు సంబంధించిన సన్నివేశాలుంటాయని ప్రేక్షకులు భావించారు కానీ ఆమె ఎవరన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది.
* కట్టప్ప బాహుబలిని చంపడానికి ముందు కాలకేయులు దాడి చేస్తారు..మళ్లీ వాళ్లు ఎందుకు వచ్చారు. వారికి నాయకత్వం వహించింది ఎవరు అన్నది చూపించలేదు.
* కుంతల రాజ్యంపై పిండారీలు ఆకస్మాత్తుగా దాడి చేస్తారు. వారి గురించి కూడా సవివరంగా చూపించలేదు.
* పార్ట్-1లో ఏ సాయం కావాలన్నా తాను ఉన్నానన్న సంగతి మరచిపోవద్దంటూ కట్టప్పకు మాట ఇస్తాడు అస్లాం ఖాన్( సుదీప్). రెండో భాగంలో అతని ద్వారా శివుడు భల్లాలదేవుడిపై పగ తీర్చుకుంటాడని భావించిన ప్రేక్షకులను నిరాశ పరిచాడు రాజమౌళి
* అవంతిక ఎవరు..ఆమె కుటుంబ నేపథ్యం లాంటి వివరాలు ఎక్కడా ప్రస్థావించలేదు.
* అనుష్క తల్లిదండ్రులు ఎవరన్న వివరాలు తెలియలేదు.
* మూవీ ఇంట్రక్షన్ ఫ్రేమ్‌లో వచ్చే సాహోరే సాంగ్‌లో ప్రభాస్ ఏనుగుపై ఊరేగుతాడు. ఏనుగుపై కూర్చొన్న వ్యక్తి దాని కదలికల కారణంగా అతని శరీరం ఊగుతుంది..కానీ ఇక్కడ ఏనుగు ఊగుతుంది కానీ ప్రభాస్ శరీరం కొంచెం కూడా కదలదు.
* ఏనుగు తన తొండంతో విల్లు పట్టుకుని ఉంటే ప్రభాస్ బాణం వేసే సీన్ గుర్తుందా..? ఏనుగుపై నిట్టనిలువుగా నిలబడటం అసాధ్యం..కానీ బాహుబలి అలాగే నిలబడి బాణం వేస్తాడు..సరిగా గమనిస్తే ప్రభాస్ ఏనుగు మీద నిలబడి ఉన్నట్లు ఉండదు. కొంచెం పక్కగా నిలబడినట్లు ఉంటుంది.
* రానా కొన్ని సీన్లలో సన్నగా..మరి కొన్ని సీన్లలో లావుగా కనిపిస్తాడు.. ఈ విషయంలో రాజమౌళీ అంతగా శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది.