బాహుబలికి ద్రోహం చేస్తున్న సెన్సార్ బోర్డు
on Apr 26, 2017
ఎన్నో ఏళ్ల కష్టం.. బాహుబలి. వందల కోట్ల పెట్టుబడి పెట్టారీ సినిమాపై. అలాంటి సినిమాకి లీకేజీల బెడద మొదలవ్వడం నిజంగా దురదృష్టకరం. బాహుబలి 2 లోని కొన్ని సీన్లు ఇప్పుడు ఆన్ లైన్ లో షికారు చేస్తున్నాయి. బాహుబలి ప్రీమియర్ ఎక్కడో పడిపోయిందని, అక్కడి నుంచే ఈ సినిమాలోని సన్నివేశాలు లీకయ్యాయని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. కానీ అసలు నిజం వేరు. ఈ లీకేజీ.. ప్రిమియర్ షోల వల్ల అవ్వలేదు. అసలు ఇప్పటి వరకూ బాహుబలికి సంబంధించిన ఎలాంటి ప్రీమియర్... ఎక్కడా పడలేదు. మరి ఈ సీన్లు ఎక్కడి నుంచి లీకయ్యాయి అనేదే అసలు ప్రశ్న. బాహుబలి 2కి సంబంధించిన సెన్సార్ ఇటీవల దుబాయ్‌లో జరిగింది.
అక్కడి సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమా లీకై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలి సెన్సార్ జరుగుతున్నప్పుడు ఆ బృందంలోని ఎవరైనా సెల్‌ఫోన్ లో సినిమా మొత్తం చిత్రీకరించి ఉండొచ్చని, అదే.. లీకేజీ రూపంలో బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇది వరకు.. ఉడుతా పంజాబ్ సినిమా కూడా ఇంతే. సెన్సార్ బోర్డు నుంచే ఈసినిమా లీకైంది. అప్పుడు ఇండియాలో జరిగితే... ఇప్పుడు దుబాయ్‌లో జరిగింది. అంతే తేడా. సెన్సార్ బోర్డుకు సినిమా పంపించాలన్నా... ఇక మీదట సినిమా వాళ్లు భయపడతారేమో..??