అవును..నిజమేనా!!
on Apr 6, 2015
అవును సినిమా మొదటి భాగం రవిబాబు కు సక్సెస్ ను మాత్రమే మార్కెట్ లో మంచి బ్రాండ్ గా నిలిచింది. దాని ఫలితమే 'అవును 2' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ సినిమాకు క్రిటిక్స్ యావరేజ్ మార్కులు వేసిన 'అవును' బ్రాండ్ రెండో భాగాన్ని కూడా సక్సెస్ ఫుల్ సినిమాగా మార్కెట్ లో నిలబెడుతోంది. 'అవును' కన్నా 'అవును-2' ఓపెనింగ్స్ రెండితల వసూళ్ళు నమోదు చేసిందని సమాచారం. ఓ పక్కన రివ్యూ స్ బాగా రాకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడం ఈ సినిమా ప్లస్ పాయింట్ గా మారింది. ఆల్రెడీ వికెండ్ అయిపోయింది గనుక, 'అవును-2' వసూళ్ళు డ్రాప్ అవడానికే ఎక్కువగా ఛాన్సుంది. అయితే సినిమా బడ్జెట్, చేసిన పబ్లిసిటీ పరంగా చూస్తే 'అవును' కన్నా 'అవును-2' సినిమాకి ఎక్కువ లాభాలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.