వయసులో తనకంటే చిన్నవాడితో అనుష్క పెళ్లికి రెడీ!
on Apr 29, 2021
టాలీవుడ్లో ప్రస్తుతం సూపర్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ఒకే ఒక్క తార అనుష్క. 39 సంవత్సరాలు నిండినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్ అనే పేరు తెచ్చుకుంది. కొంత కాలం క్రితం దాకా బాహుబలి ప్రభాస్, అనుష్క పెళ్లాడనున్నారనే వార్త విపరీతంగా హల్చల్ చేయడం మనకు తెలుసు. వాళ్లిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ వారి అభిమానులను అమితంగా అలరించింది.
ఒడ్డూ పొడుగూ, అందం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్లు ఉంటే వాళ్లిద్దరూ నిజ జీవితంలోనూ జంట అయితే బాగుంటుందని వారు ఆశిస్తూ వచ్చారు. అయితే తమకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవనీ, తాము జస్ట్ ఫ్రెండ్స్ అనీ క్లారిటీ ఇచ్చి వారిని రియల్ లైఫ్ కపుల్‌గా చూడాలనుకుంటున్న వాళ్లందరి ఆశల్నీ తుంచేశారు.
కాగా లేటెస్ట్గా అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోమంటూ సలహా ఇస్తున్నారనీ, అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ వినిపిస్తోంది. ఇప్పటికే వారు దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడి సంబంధాన్ని చూశారంట. కాకపోతే అతను అనుష్క కంటే వయసులో కాస్త చిన్నవాడంట.
కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా ఉండటంతో, పరిస్థితులు కాస్త కుదురుకున్నాక ముహూర్తాలు పెట్టుకుంటారనేది ప్రచార సారాంశం. అయితే ఈ ప్రచారంపై అనుష్క ఇంతదాకా స్పందించలేదు. ఏదేమైనా ఈ ఏడాది కానీ, వచ్చే ఏడాది కానీ స్వీటీ పెళ్లి జరగటం ఖాయంగా కనిపిస్తోంది.