ప్రభాస్ స్పిరిట్ లో మరో స్టార్ హీరో..!
on Mar 23, 2025
ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజి సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. తన తదుపరి చిత్రం 'స్పిరిట్' (Spirit)ను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న సంగతి విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా మరో బిగ్ యాక్టర్ పేరు తెరపైకి వచ్చింది.
స్పిరిట్ కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దింపుతున్నాడట సందీప్ రెడ్డి. ఇటీవల విజయ్ ని కలిసి సందీప్ స్క్రిప్ట్ చెప్పాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చిన సేతుపతి.. ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇందులో విజయ్ సేతుపతి విలన్ గానో లేదంటే ప్రత్యేక పాత్రలోనో కాదని.. ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడని టాక్.
స్పిరిట్ స్క్రిప్ట్ అదిరిపోయేలా వచ్చిందట. ప్రభాస్ రోల్ తో పాటు పలు రోల్స్ గుర్తుండిపోయేలా ఉంటాయట. అందుకే ఆర్టిస్ట్ ల విషయంలో సందీప్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని అంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
