రామ్ చరణ్ 'పెద్ది'లో మరో బిగ్ స్టార్!
on Apr 15, 2025
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది' (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దిలో సౌత్ కి చెందిన ఒక బిగ్ స్టార్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు వినికిడి. ఆ స్టార్ ఎవరో కాదు సూర్య అని ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందట. నిడివి తక్కువే అయినప్పటికీ, అది కథకి ఎంతో కీలకమైన పాత్రట. ఈ రోల్ కోసం సూర్యని సంప్రదించగా, ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చరణ్, సూర్య మధ్య మంచి అనుబంధముంది. అందుకే పెద్దిలో అతిథి పాత్ర చేయడానికి సూర్య వెంటనే అంగీకరించినట్లు వినికిడి.
సరైన పాత్ర పడాలే కానీ, నిడివితో సంబంధం లేకుండా సూర్య తన స్క్రీన్ ప్రజెన్స్ తో మ్యాజిక్ చేస్తాడు. విక్రమ్ సినిమా చివరిలో రోలెక్స్ గా సూర్య కనిపించిన తీరుని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినప్పటికీ, అందరినీ తనవైపు తిప్పుకునేలా చేశాడు సూర్య. ఇప్పుడు పెద్దితో కూడా అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
