షాకింగ్.. ‘ఓజి’లో అకీరా నందన్ చేస్తున్న క్యారెక్టర్ ఇదే?
on Aug 25, 2025
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల వరసలో హరిహర వీరమల్లు తర్వాత రాబోతున్న సినిమా ‘ఓజి’. సెప్టెంబర్ 25న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. దాంతో భారీగా ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. షూటింగ్ ఆల్రెడీ పూర్తయినప్పటికీ కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఓజి గ్లింప్స్, పవర్ స్టోర్మ్ సాంగ్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక అప్‌డేట్ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. పవన్‌కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనని, సినిమాలో అకీరా ఎలా కనిపించబోతున్నాడు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తుందని, అందులో టీనేజ్ గెటప్‌లో ఉన్న క్యారెక్టర్‌లో అకీరా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ క్యారెక్టర్‌ను నిజంగానే అకీరా చేసి ఉంటే ఇక ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. దీంతో సినిమాకి మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సినిమాపై ఇప్పటికే వున్న అంచనాలు రెట్టింపు అవుతాయి.
ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఓజి’ చిత్రం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఒక గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పవన్‌కళ్యాణ్ అభిమానులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్‌కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ సినిమాకి థమన్ చేసిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద హైలైట్ కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పవర్ స్టోర్మ్ సాంగ్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వినాయక చవితికి సినిమాలోని సువ్వీ సువ్వీ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు క్రియేట్ అయిన బజ్ చూస్తుంటే సినిమా పరంగా, కలెక్షన్ల పరంగా ‘ఓజి’ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



