అఖిల్-శ్రేయాల బంధాన్ని నిలిపిన ఉపాసన..?
on Mar 6, 2017

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్‌ల వివాహం వచ్చే మే నెలలో ఘనంగా జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. అందుకు సంబంధించి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయింది. కాని ఏం జరిగిందో ఏంటో తెలియదు కాని ఈ పెళ్లి రద్దయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహం రద్దవ్వడానికి శ్రేయా కారణమని ఒకరోజు...కాదు అఖిల్ కారణమని ఒకరోజు..కాదు కాదు అసలు ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చలేదని ఇలా రకరకాల పుకార్లు వస్తున్నా ఇరు పక్షాల పెద్దలు ఎవరు పెదవి విప్పడం లేదు.
అయితే ఈ పెళ్లిని తిరిగి యదావిధిగా జరిపించేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం రంగంలోకి దిగింది. ముఖ్యంగా చిరు కోడలు ఉపాసన ఈ పని మొత్తం తన భుజాలపై వేసుకుందట. ఎందుకంటే అపోలో ప్రతాప్ రెడ్డి గారి కుటుంబానికి..జీవీకే కుటుంబానికి ఎప్పటి నుంచో మంచి రిలేషన్‌షిప్ ఉంది. పైగా శ్రేయకు, ఉపాసన క్లోజ్ ఫ్రెండ్. ఎవరి మాట విన్నా వినకపోయినా ఫ్రెండ్‌గా శ్రేయ తన మాట వింటుందని ఉపాసన నమ్మకం. ఉపాసన రాయబారం ఫలించి అఖిల్-శ్రేయ భూపాల్ ఇద్దరు విభేదాలను పక్కనపెట్టి ఒక్కటయ్యితే అంతా హ్యాపి. మరి చూద్దాం ఈ రాయభారం ఎంతవరకు ఫలిస్తుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



