ఎన్టీఆర్ 'డ్రాగన్'లో విద్యాబాలన్!
on May 21, 2025

ఆగస్టులో బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఫిమేల్ రోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నిడివితో సంబంధం లేకుండా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా ఒక పవర్ ఫుల్ ఫిమేల్ రోల్ ని రాశాడట. ఆ రోల్ కి విద్యాబాలన్ అయితే బాగుంటుందని ఆమెని సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర చేయడానికి విద్యాబాలన్ సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి.
కాగా, గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ సరసన నటించింది విద్యాబాలన్. అప్పుడు బాబాయ్ కి జోడిగా నటించిన బాలన్.. ఇప్పుడు అబ్బాయ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని అనే వార్త ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



