సూపర్ స్టార్ తో డర్టీ బ్యూటీ?
on Jun 4, 2015
టాలీవుడ్ , కోలీవుడ్ ముద్దుగుమ్మలతో స్టెప్స్ వేసి వేసి బోర్ కొట్టిందట. అందుకే బీ టౌన్ భామలవైపు చూస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. గత కొంతకాలంగా రజనీ సినిమా అనగానే వరసగా బాలీవుడ్ బ్యూటీల పేర్లే వినిపిస్తున్నాయి. రోబోలో ఐశ్వర్యారాయ్, కొచ్చాడయ్యాన్ లో దీపిక పదుకునే, లింగలో సోనాక్షి సిన్హా. రీసెంట్ గా మరో బ్యూటీ. రజనీకాంత్ హీరోగా దర్శకుడు రంజిత్ తెరకెక్కించనున్న చిత్రం ఆగస్ట్ 1న సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మొదట ఇందులో హీరోయిన్ ఉండదనే ప్రచారం జరిగింది. ఇంతలో ఏమనుకున్నారో ఏమో...రజనీ సరసన డర్టీ పిక్చర్ బ్యూటీ దుమ్ములేపుతుందని ఫిక్సయ్యారట. అప్పుడే విద్యాబాలన్ ని అడగడం గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం కూడా జరిగిపోయిందట. వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తిచేసి త్వరత్వరగా విడుదల చేసి రజనీ మళ్లీ రోబో 2 పై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. అందులోనూ మళ్లీ ఐశ్వర్యారాయ్ నటిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లనున్న రజనీకాంత్ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న విద్యా సంబరపడిపోతోందట. మరి ఈ సినిమా హిట్టైతే విద్యా బాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ జెండాపాతెయ్యడం ఖాయం.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)