'డాకు మహారాజ్'లో ముగ్గురు హీరోల గెస్ట్ రోల్స్.. ఎవరో తెలుసా..?
on Dec 6, 2024
'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
'డాకు మహారాజ్'లో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో సర్ ప్రైజ్ చేయనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. దానిపై ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అలాంటిది ఇప్పుడు మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు యువ హీరోలు అతిథి పాత్రల్లో మెరవనున్నారట. ఆ హీరోలు ఎవరో కాదు.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి అని సమాచారం. బాలయ్యకు ఈ యువ హీరోలతో మంచి అనుబంధముంది. పైగా ఈ యువ హీరోలు సితార బ్యానర్ లో సినిమాలు చేస్తూ, నిర్మాత నాగవంశీతో కూడా సన్నిహితంగా మెలుగుతుంటారు. ఈ లెక్కన 'డాకు మహారాజ్'లో ఈ యంగ్ హీరోలు గెస్ట్ రోల్స్ లో మెరవనున్నారనే వార్తలను కొట్టిపారేయలేం.
Also Read